Corona: జంతువుల మధ్య కనిపించని కొవిడ్‌ వ్యాప్తి!

కొవిడ్‌ బారిన పడ్డ యజమానులకు చెందిన పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా సార్స్‌ 2 కొవిడ్‌-19 వైరస్‌ ఎక్కువగానే సోకుతోందని ‘యూరోపియన్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్టియస్‌ డిసీజస్’కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది. రెండు నుంచి 200 రోజుల లోపు కొవిడ్‌ సోకిన 196 మంది యజమానుల ఇళ్లను నెదర్లాండ్స్‌కు  చెందిన ఉట్రెక్ట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం సందర్శించింది.

Updated : 08 Jul 2021 04:50 IST

   మనుషుల నుంచి జంతువులకే కొవిడ్‌ వ్యాప్తి!

కొవిడ్‌ బారిన పడ్డ యజమానులకు చెందిన పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా సార్స్‌ 2 కొవిడ్‌-19 వైరస్‌ ఎక్కువగానే సోకుతోందని ‘యూరోపియన్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్టియస్‌ డిసీజస్’కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది. రెండు నుంచి 200 రోజుల లోపు కొవిడ్‌ సోకిన 196 మంది యజమానుల ఇళ్లను నెదర్లాండ్స్‌కు  చెందిన ఉట్రెక్ట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం సందర్శించింది. వారి ఇళ్లల్లోని 156 కుక్కలు, 154 పిల్లుల నుంచి రక్త నమూనాలు, గొంతు నుంచి స్వాబ్‌ను సేకరించారు. ఆ తర్వాత ఆ స్వాబ్‌లకు పీసీఆర్‌, రక్తనమూనాలకు యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు.  అందులో ఆరు పిల్లులు, ఏడు కుక్కలకు(4.2శాతం) పీసీఆర్‌ టెస్టులో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అలాగే 31 పిల్లులు, 23 కుక్కల (17.4శాతం) రక్తంలోయాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత మరో 11 జంతువులకు రెండోసారి టెస్టులు చేసినప్పుడు వాటిలోనూ యాంటీబాడీలు కనిపించాయి. మూడోసారి టెస్టు చేసినప్పుడు మరో మూడు పిల్లుల్లోనూ యాంటీబాడీలు కనిపించాయి. అంటే వాటికి కూడా కొవిడ్‌ సోకి, నయమైనట్లు అర్థమైంది.

యజమానుల నుంచి 40 శాతం జంతువులకు వ్యాప్తి! 

ఇన్‌ఫెక్షన్‌ సోకిన తోటి జంతువులు గల ఇళ్లల్లోనే మరో ఎనిమిది కుక్కలు, పిల్లులు ఉంటున్నప్పటికీ వాటికి కొవిడ్‌ సోకలేదు. అంటే తోటి జంతువులనుంచి వాటికి ఇన్‌ఫెక్షన్‌ సోకడం లేదని తేలింది. మొత్తంగా 196 ఇళ్లల్లోని 40 (20.4 శాతం) జంతువుల్లో యాంటీబాడీలు కనిపించాయి. దీనర్థం యజమానులు కొవిడ్‌ బారిన పడ్డప్పుడు, వారితో సహవాసం చేసే పెంపుడు జంతువులకు కూడా ఎక్కువగా వైరస్‌ సోకిందన్నమాట.  అలాగే సాధారణంగా కొవిడ్‌ మనుషుల నుంచి జంతువులకే సోకుతోందన్నమాట.  ఒక జంతువు నుంచి మిగతావాటికి వైరస్  సోకుతున్నట్టు కనిపించలేదు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎక్కడా జంతువులు వైరస్‌ను వ్యాపింపజేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని  పరిశోధకులు తెలిపారు. అందువల్ల కొవిడ్‌ సోకినప్పుడు యజమానులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వారు కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని