మొత్తం డబ్బాలో కరోనా వైరస్‌ !

‘ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ మొత్తం ఎంతుంటుందో తెలుసా? దాన్ని చుట్టి ఒక కోక్‌ డబ్బాలో పెట్టేసే అంత.’ అని బ్రిటన్‌కు చెందిన ఓ గణిత శాస్త్రవేత్త వెల్లడిస్తున్నారు.

Updated : 11 Feb 2021 04:34 IST

కొవిడ్‌ లెక్కలు తేల్చిన బ్రిటిష్‌ గణిత శాస్త్రవేత్త

లండన్‌: ‘ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ మొత్తం ఎంతుంటుందో తెలుసా? దాన్ని చుట్టి ఒక కోక్‌ డబ్బాలో పెట్టేసే అంత.’ అని బ్రిటన్‌కు చెందిన ఓ గణిత శాస్త్రవేత్త వెల్లడిస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఎంత చిన్నగా ఉంటుందో ఈ పరిశోధనలో వెల్లడవుతోంది. బాత్‌ యూనివర్సిటీకి చెందిన గణిత నిపుణుడు కిట్‌ యేట్స్‌ ఈ పరిశోధన నిర్వహించారు. దాని ప్రకారం ప్రపంచంలో  రెండు బిలియన్‌ బిలియన్ల సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ కణాలు ఉండొచ్చని తెలిపారు.

ఈ కరోనా లెక్కల గురించి యేట్స్‌ మాట్లాడుతూ.. ‘‘సార్స్‌-కోవ్‌-2 వ్యాసం సుమారు 100 నానో మీటర్లుగా తీసుకున్నాను. అది ఒక మీటరులో వందో వంతు. దీని ఆధారంగా వృత్తాకారంలో ఉండే వైరస్‌ పరిమాణాన్ని కనుగొన్నారు. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్ల కోసం లోపలి బయటి భాగాన్ని వదిలేస్తాయి. అలా చూసుకున్నా మొత్తం వైరస్‌ 330 మిల్లీలీటర్లు మాత్రమే. అది ఒక కోక్‌ డబ్బా కన్నా తక్కువ.’’ అని తెలిపారు. గత సంవత్సరంలో కలిగిన ఇబ్బందులు, కష్టాలు, ప్రాణనష్టం అన్నీ మన చేతిలో ఇమిడేటువంటి చిన్నదే చేసింది అనుకోవడం ఆశ్చర్యంగా ఉందని యేట్స్‌ తెలిపారు. కరోనా సృష్టించిన విలయంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.34 మిలియన్ల ప్రజలు మరణించారు. 107 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు.

ఇవీ చదవండి..

ఏసీతో కరోనా వ్యాప్తి ఎలా అంటే..

18న దేశ వ్యాప్తంగా రైల్‌ రోకో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని