Covid Update: కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి... తెలంగాణలో కొత్తగా 494 కేసులు

తెలంగాణలో కొవిడ్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో

Published : 23 Jun 2022 20:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 315 కేసులు నమోదు కావడం గమనార్హం. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 126 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివిటీ రేటు ఎక్కువున్న జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. కొవిడ్‌ వైరస్‌ మ్యుటేషన్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని