coronavaccine: ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి

45 ఏళ్లు పైబడి, కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

Updated : 04 May 2021 18:54 IST

హైదరాబాద్‌: రోజు రోజుకీ కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చింది. 45 ఏళ్లు పైబడి, కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. అయితే, ప్రైవేటు సెంటర్లు/ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి వ్యాక్సిన్‌ సరఫరా చేయదు. వారే సొంతంగా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అదే విధంగా  కొవిడ్ రోగులకు చికిత్స విషయంలో పలు సూచనలు చేసింది. తీవ్ర ,అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆక్సిజన్‌ 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యపై ఆస్పత్రి బయట వివరాలు ఉంచాలని ఆయన ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రానికి నిన్న 4లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసుల చేరుకోగా..  తాజాగా 75వేల కొవాగ్జిన్‌ డోసులు వచ్చాయి. సాయంత్రానికి 1.25లక్షల కొవాగ్జిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని