
Ts News: కొవిడ్ ఎఫెక్ట్... జైళ్లలో ఖైదీల ములాఖత్‌లపై ఆంక్షలు
హైదరాబాద్: కరోనా కారణంగా జైళ్లలో ఖైదీల ములాఖత్‌లు నిలిచిపోనున్నాయి. ఈనెల 21 నుంచి జైళ్లలో ములాఖత్‌లు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఖైదీలను కలిసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు జైళ్లకు వస్తుంటారు. నిబంధనల మేరకు ఖైదీలను కలిసేందుకు జైలు అధికారులు అనుమతిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జైళ్లలో ఉన్న ఖైదీలతో ఇతరులను కలవనీయొద్దని నిర్ణయించారు. కరోనా మొదటి దశ సందర్భంగా 2020 మార్చి నెలలో ఖైదీల ములాఖత్‌లను అధికారులు నిలిపివేశారు. గతేడాది సెప్టెంబరులో తిరిగి ప్రారంభించారు. నాలుగు నెలలపాటు కొనసాగినప్పటికీ... మరోసారి అధికారులు ములాఖత్‌లపై నిర్ణయం తీసుకున్నారు. కరోనా మూడోదశ వ్యాప్తి అదుపులోకి వచ్చేంత వరకు ములాఖత్‌లు ఉండవని జైళ్లశాఖ అధికారులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.