CoWin certificate: ‘కొవిన్‌’లో త్వరలో కొత్త ఫీచర్‌.. పుట్టిన తేదీతో సర్టిఫికేట్లు

వ్యాక్సినేషన్‌ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల కోసం ‘కొవిన్‌’లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పూర్తి పుట్టిన తేదీ పొందుపర్చిన ‘కొవిన్‌’ సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ ప్రమాణాల విషయంలో...

Updated : 26 Sep 2021 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాక్సినేషన్‌ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల కోసం ‘కొవిన్‌’లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పూర్తి పుట్టిన తేదీ పొందుపర్చిన ‘కొవిన్‌’ సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ ప్రమాణాల విషయంలో ఇటీవల భారత్‌, బ్రిటన్‌ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ధ్రువపత్రంలో వ్యక్తి వయస్సు మాత్రమే నమోదవుతోంది. దీనికి పరిష్కారంగా.. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలకు అనుగుణంగా పుట్టిన తేదీతో కూడిన టీకా సర్టిఫికేట్లు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘కొవిన్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ పూర్తయి, విదేశాలకు వెళ్లాలనుకునేవారి టీకా ధ్రువపత్రంపై పుట్టిన తేదీ కూడ ఉంటుంది’ అని ఓ అధికారి వివరించారు. భారత్‌లో తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌తోనే సమస్య ఉందని ఇటీవల బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ధ్రువపత్రాలకు కనీస ప్రమాణాలుండాలని వ్యాఖ్యానించింది. ఈ విషయమై కొవిన్‌ యాప్‌, ఎన్‌హెచ్‌ఎస్‌ యాప్‌ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్‌కు బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని