Ruia మృతులు 11 కాదు 23: నారాయ‌ణ‌

రుయా ఆస్ప‌త్రిలో 11 మందే చ‌నిపోయార‌ని ప్ర‌భుత్వం అస‌త్యం చెబుతోంద‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మొత్తం 23 మంది చ‌నిపోయారంటూ వారి పేర్ల‌తో సహా వివ‌రాలు తెలిపారు. మృతులను 

Updated : 12 May 2021 14:31 IST

తిరుప‌తి:  రుయా ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ అంద‌క‌ 11 మందే చ‌నిపోయార‌ని ప్ర‌భుత్వం అస‌త్యం చెబుతోంద‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మొత్తం 23 మంది చ‌నిపోయారంటూ వారి పేర్ల‌తో సహా వివ‌రాలు తెలిపారు. మృతులను కె.బాలు, జయచంద్ర, రామారావు, రమేశ్‌ బాబు, భువనేశ్వరి బాబు, కలందర్‌, రమణాచారి, ప్రభాకర్‌, మహేంద్ర, షాహిద్‌, గజేంద్రబాబు, పుష్పలత, మహమ్మద్‌ పాషా, వేణుగోపాల్‌, గౌడ్‌ భాషా, రాజమ్మ, మదన్మోహన్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, సుబ్రమణ్యం, బి.సులోచన, తనుజరాణి, పజులాల్‌, వెంకట సుబ్బయ్యగా వెల్ల‌డించారు. ఆక్సిజ‌న్ విష‌యంలో రాష్ట్ర  ప్ర‌భుత్వం కేంద్రాన్ని ఎందుకు నిల‌దీయ‌లేక‌పోతుంద‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు.

''రుయాలో మృతుల సంఖ్య‌పై ప్ర‌భుత్వం వాస్త‌వాలు చెప్ప‌ట్లేదు. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు రెండ్రోజుల ముందు తెప్పించుకొని నిల్వ పెట్టుకోరా? ఆక్సిజ‌న్ ఇవ్వాల్సిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కంపెనీల‌కు కులాలు ఆపాదిస్తారా?   విచార‌ణ క‌మిటీ వ్యర్థం.. ప్ర‌భుత్వం ఏం చెబితే అది రాస్తుంది. వైకాపా నేత‌ల క‌ల్యాణ మండ‌ల‌పాలు కొవిడ్ కేంద్రాలుగా మార్చుకోవాలి. కేంద్రంపై పోరాడ‌లేక.. ప్ర‌తిప‌క్ష నేత, వైద్యుల‌పై అభాండాలు వేస్తారా?'' అని నారాయ‌ణ నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని