Andhra News: ప్రసూతి ఆస్పత్రి భవనాలను మారిస్తే అడ్డుకుంటాం: సీపీఐ నేత నారాయణ

తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నేతలు ఆందోళకు దిగారు.

Updated : 16 Aug 2022 15:10 IST

తిరుపతి: తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నేతలు ఆందోళకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ నేత నారాయణతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్‌ మహిళా ద్రోహి అని.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ప్రసూతి ఆస్పత్రిని నగర పాలక సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రసూతి ఆస్పత్రి భవనాలను మారిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రిపై పెట్టిన నగర పాలక సంస్థ బోర్డును తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు ప్రసూతి ఆస్పత్రిని తిరుపతి నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మహిళలలు చించి తగులపెట్టారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని