CPS: సీపీఎస్‌ రద్దుకు పోరాటం.. 4లక్షల మందితో మిలీనియం మార్చ్‌

సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పోరాటం చేసిన సీపీఎస్‌ ఉద్యోగులు

Updated : 15 May 2022 13:54 IST

విజయవాడ: సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పోరాటం చేసిన సీపీఎస్‌ ఉద్యోగులు ఇవాళ విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘దగాకోరు మోసం’ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేసి ఆందోళన తెలిపారు. మరోవైపు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా సీపీఎస్‌ రద్దు డిమాండ్‌తో మిలీనియం మార్చ్‌ చేపట్టాలని నిర్ణయించారు.

సెప్టెంబర్‌ 1న విజయవాడలో మిలీనియం మార్చ్‌ చేపట్టనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. 4లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులతో మార్చ్‌ చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు. దీంతో పాటు ఇకపై కలిసి ఉద్యమించాలని 2 ప్రధాన సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీపీఎస్‌ ఈఏ, ఏపీసీపీఎస్‌ యూఎస్‌ కలిసి పోరాటం చేస్తాయని ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. రెండు సంఘాలు కలిసి మిలీనియం మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని