Andhra News: సీపీఎస్‌ రద్దు చేయాలంటూ ఏలూరులో ఉద్యోగుల భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.‘

Published : 05 Apr 2022 11:47 IST

ఏలూరు అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.‘సీపీఎస్‌ ఉద్యోగుల శంఖారావం’ పేరుతో ప్రధాన రహదారిలో ర్యాలీ చేపట్టారు. స్థానిక తితిదే కల్యాణ మండపం నుంచి అగ్నిమాపక కూడలి మీదుగా కలెక్టరేట్‌ వరకు ఇది కొనసాగింది.

ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని.. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు సాగారు. ఈ ర్యాలీలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, డెమోక్రటిక్‌ పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని