సీపీఎస్ కేసులు ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉద్యమం సమయంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను

Published : 30 Jul 2020 21:18 IST

అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉద్యమం సమయంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులనే ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని