Published : 25 May 2022 15:44 IST

Amaravati: రాజధానిలో ఎల్పీఎస్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోంది: సీఆర్డీఏ కమిషనర్‌

అమరావతి: రాజధాని ప్రాంతంలోని ఎల్పీఎస్‌ (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌) లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నామని.. అందుకు అనుగుణంగానే పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు పూర్తవుతాయన్నారు. రాజధాని పరిధిలో పనులు చేపట్టాలంటే సీఆర్డీఏకు నిధులు కావాలని.. అందుకే అమరావతి టౌన్‌షిప్‌ లాంటివి అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయిస్తున్నామని చెప్పారు. వీటి ద్వారా రూ.310 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుందన్నారు. 

రాజధాని పనుల కోసం రుణం ఇవ్వాలని బ్యాంకులను కూడా సంప్రదించామని.. రూ.3వేట కోట్ల రుణం అడిగితే రెండు దఫాలుగా ఇస్తామని బ్యాంకర్లు తెలిపారని వివేక్‌యాదవ్‌ వివరించారు. ఎల్పీఎస్‌ లే అవుట్ల అభివృద్ధికి సంబంధించి రైతులకు ఇచ్చిన హామీలకు సీఆర్డీఏ కట్టుబడి ఉంటుందని.. దశల వారీగా పనులు ప్రారంభమవుతాయన్నారు. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు సంబంధించి సీఆర్డీఏ మధ్యవర్తి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని