కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..

కరోనా దెబ్బకు కాశీలో అంత్యక్రియలు నిర్వహించే ఘాట్లలో పరిస్థితి దయనీయంగా మారింది. భారీ సంఖ్యలో వస్తున్న శవాలు, కట్టెల కొరత, నిర్వాహకుల నిస్సహాయతతో కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టతరంగా మారింది....

Updated : 21 Apr 2021 05:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాశీ హిందువుల పుణ్యక్షేత్రమే కాదు.. ముక్తి క్షేత్రం కూడా. అక్కడ ప్రాణాలు వదిలినా.. అంత్యక్రియలు జరిగినా.. శివుని సన్నిధి దక్కుతుందని హిందువులు విశ్వసిస్తారు. అందుకే చివరి రోజులను గడిపేందుకు దేశం నలుమూలల అనేక మంది కాశీకి వస్తుంటారు. అయితే కరోనా దెబ్బకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే ఘాట్లలో పరిస్థితి దయనీయంగా మారింది. భారీ సంఖ్యలో వస్తున్న శవాలు, కట్టెల కొరత, నిర్వాహకుల నిస్సహాయతతో కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టతరంగా మారింది. 

కాశీలోని గంగా తీరంలో ఉన్న హరిశ్చంద్ర ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌లలో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. రెండు దశ కరోనా ఉద్ధృతితో దేశవ్యాప్తంగా భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. కాగా అనేక మంది మృతుల బంధువులు మృతదేహాలను అంత్యక్రియల కోసం కాశీకి తీసుకువస్తున్నారు. దీంతో ఆ రెండు ఘాట్లు శవాల దిబ్బలుగా మారిపోయాయి. భారీ సంఖ్యలో శవాలు వస్తుండటంతో దహనసంస్కారాల నిర్వహణకు గంటల కొద్దీ వేచిచూడాల్సి వస్తోంది. కట్టెలు, ఇతర సామగ్రి కొరత ఏర్పడుతోంది. అంత్యక్రియల నిర్వాహకులు రేట్లను భారీగా పెంచేస్తున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గేవరకు కాశీలో పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని