IND vs AUS: ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు పూర్తి.. రాత్రి 7 తర్వాతే ఆన్‌లైన్‌లో: హెచ్‌సీఏ

సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు 

Published : 22 Sep 2022 16:26 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు ఈరోజు పూర్తయ్యాయని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వెల్లడించింది. దీంతో క్యూలైన్లలో నిల్చున్న వారిని పోలీసులు వెనక్కి పంపించేశారు. ఈరోజు రాత్రి 7 తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచుతామని హెచ్‌సీఏ నిర్వాహకులు వెల్లడించారు. 

ఈనెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు టికెట్ల కొనుగోలుకు అంచనాలకు మించి క్రికెట్‌ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య టికెట్‌ విక్రయాలు జరిగాయి. దాదాపు 2వేల ఆఫ్‌లైన్‌ టికెట్లు విక్రయించిన తర్వాత కౌంటర్లు మూసివేశారు. ఉదయం క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని