AP NEWS: 37 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల్లో 15 ఆసుపత్రులను తనిఖీ చేసి 9 ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు..

Published : 21 Jun 2021 01:13 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల్లో 15 ఆసుపత్రులను తనిఖీ చేసి 9 ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

కొవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 37 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక మొత్తం వసూలు చేయడం, రెమిడిసివర్‌ ఇంజెక్షన్లు దుర్వినియోగం చేయడం, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం , ప్రభుత్వం అనుమతి లేకుండా కరోనా చికిత్స చేయడం, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన రోగులకు కరోనా చికిత్సను తిరస్కరిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించడం జరిగిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని