Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్‌లోని ఓ నాలా ఒడ్డున మొసలి పిల్ల కలకలం సృష్టించింది.

Published : 27 Sep 2023 20:14 IST

ఖైరతాబాద్‌: హైదరాబాద్‌లోని ఓ నాలా ఒడ్డున మొసలి పిల్ల కలకలం సృష్టించింది. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌ - చింతలబస్తీ మధ్య నూతన వంతెన నిర్మాణం చేపట్టిన చోట ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో బల్కాపూర్‌ నాలా ఉద్ధృతిలో ఈ మొసలి పిల్ల కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. 

మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసు, అటవీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్లు చేసినా.. గంటల తరబడి ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలా సమీపంలో నివాసాలు ఉన్నాయని, రాత్రి ఎక్కడికి చేరుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. నాలాపై నిర్మాణ పనులు 3 నెలలైనా పూర్తి కాకపోవడం, అక్కడే మొసలి బయటకు చేరుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, మొసలిని చూసేందుకు జనం గుంపులుగా రావడంతో గందరగోళం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని