Yadadri: యాదాద్రిలో భక్తుల రద్దీ... వీఐపీ దర్శన వేళల మార్పు

యాదాద్రీశుడి నిజ స్వరూపం చూసి తరించాలని తరలివచ్చిన భక్తులతో శ్రీలక్ష్మీనారసింహుని సన్నిధి భక్తజన సంద్రమైంది.

Published : 04 Apr 2022 01:18 IST

యాదాద్రి: యాదాద్రీశుడి నిజ స్వరూపం చూసి తరించాలని తరలివచ్చిన భక్తులతో శ్రీలక్ష్మీనారసింహుని సన్నిధి భక్తజన సంద్రమైంది. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రీకులతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిశాయి. వసతి సముదాయాలు నిండిపోయాయి. కొండపై బస్‌ బే ప్రాంగణంలో, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్‌, కొండ కింద పుష్కరిణి, కల్యాణ కట్ట వద్ద భక్తుల రద్దీ కనిపించింది. దీంతో భక్తుల దర్శనానికి దాదాపు 3గంటల సమయం పట్టింది. 

వీఐపీల బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వీఐపీల బ్రేక్‌ దర్శన వేళల్లో దేవస్థానం మార్పులు చేసింది. యాదాద్రికి భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ మేరకు ప్రతి శని, ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో వీఐపీల బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని