CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే తుది గడువు
సీఆర్‌పీఎఫ్(CRPF)లో 1458 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇంటర్ విద్యార్హతపై ఆకర్షణీయ వేతనంతో ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగాల కోసం జనవరి 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
దిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇంటర్(Intermediate) అర్హతతో మొత్తం 1,458 ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల్ని భర్తీ కోసం జనవరి 4నుంచి జనవరి 31 రాత్రి 11.55 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోనేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) ఉద్యోగాలు 143 కాగా.. హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు 1,315 ఉన్నాయి. ఏఎస్సై పోస్టులకు నెలకు వేతన శ్రేణి రూ.29,200 - రూ.92,300; హెడ్‌కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500-రూ.81,100గా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సీబీటీ అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 తేదీల్లో జరుగుతుంది.
మన దగ్గర పరీక్షా కేంద్రాలివే..
అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
CM KCR: 23న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
-
Crime News
Teenmar Mallanna: కానిస్టేబుళ్లపై దాడి కేసు.. చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న
-
India News
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే
-
Movies News
Sreeleela: నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని: శ్రీలీల
-
World News
London: భారత ప్రభుత్వం ప్రతిచర్య.. లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు