Latest jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఇంటర్‌పై భారీగా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?

 సీఆర్‌పీఎఫ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌ విద్యార్హతపై ఆకర్షణీయ వేతనంతో ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగాల కోసం జనవరి 4 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published : 29 Dec 2022 01:17 IST

దిల్లీ: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌(Job Notification) ఇచ్చింది. ఇంటర్‌(Intermediate) అర్హతపై మొత్తం 1,458 ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు తెలిపింది. జనవరి 4నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) ఉద్యోగాలు 143 కాగా.. హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు 1,315 ఉన్నాయి. ఏఎస్సై పోస్టులకు నెలకు వేతనం రూ.29,200 - రూ.92,300; హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.25,500-రూ.81,100గా ఉంటుందని పేర్కొంది. 

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

2023 జనవరి 25 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని నిబంధన విధించింది.  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సీబీటీ అడ్మిట్‌ కార్డులను ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 తేదీల్లో జరుగుతుంది. 

మన దగ్గర పరీక్షా కేంద్రాలివే..

అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు,  పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని