Nirabh Kumar: చంద్రబాబు వద్ద పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది: సీఎస్‌ నీరభ్‌ కుమార్‌

విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2024 22:36 IST

అమరావతి: విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక తొలి బాధ్యతగా.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం, భారత ప్రధాని పర్యటనను పర్యవేక్షించటం వంటి కీలక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని కూడా వస్తున్నందున భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీతో చర్చించి తగు సూచనలు చేశామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నందున ప్రొటోకాల్ పరంగా వారికి కల్పించాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక బృందాలను నియమించినట్లు సీఎస్ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని