GHMC: ఓఆర్‌ఆర్‌ వరకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాల సేవలు!

భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.

Published : 12 Jun 2024 00:08 IST

హైదరాబాద్‌: భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదలు, విపత్తుల నిర్వహణపై సచివాలయంలో వివిధ శాఖలతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలోని డిజాస్టర్‌ రెస్పాన్స్‌ విభాగాన్ని అదనపు సిబ్బంది, పరికరాలతో మరింత పటిష్ఠ పరచనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని 30 డీఆర్‌ఎఫ్‌ బృందాలను 45కి పెంచుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్నందున రసాయనిక, అగ్నిప్రమాదాలు ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

‘‘హైదరాబాద్‌లోని 141 సమస్యాత్మక ప్రాంతాల్లో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి తదితర శాఖలు సమన్వయంగా చర్యలు చేపట్టాలి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల్లో డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలి. విపత్తులు తలెత్తినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ విభాగంతో సమన్వయంతో పనిచేయాలి. ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగుళూరులో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల పనితీరుపై అధ్యయనం చేయాలి’’అని అధికారులకు సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని