Hyderabad: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించాలి: సీఎస్‌ శాంతి కుమారి

58, 59 ఉత్తర్వుల కింద స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు గడువును మరో నెల రోజులు పొడిగించడం, కటాఫ్ తేదీని 2020 జూన్ రెండో తేదీకి పొడిగించిన తరుణంలో చాలా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. 

Published : 01 Apr 2023 22:28 IST

హైదరాబాద్‌: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం 58, 59 ఉత్తర్వుల కింద గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వీటితో పాటు 58, 59, 76, 118 ఉత్తర్వులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ త్వరగా పరిష్కరించాలని సీఎస్‌ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ప్రధాన కార్యదర్శి.. కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, పేదలకు ఇళ్ల స్థలాలు, రెండు పడక గదుల ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు. 

58, 59 ఉత్తర్వుల కింద స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు గడువును మరో నెల రోజులు పొడిగించడం, కటాఫ్ తేదీని 2020 జూన్ రెండో తేదీకి పొడిగించిన తరుణంలో చాలా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకు ముందు క్రమబద్ధీకరణ చేయించుకోని వారితో సహా అధిక సంఖ్యలో ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎస్‌ కోరారు. 47 రోజుల్లో 96లక్షల మందికి పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారన్న సీఎస్‌.. ఈ ఘనత సాధించినందుకు కలెక్టర్లను అభినందించారు. రానున్న 50 రోజుల్లో రాష్ట్రంలో 2కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి కొత్త రికార్డు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంటి వెలుగు శిబిరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సీఎస్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు