Medical Oxygen: రవాణా వేగవంతం చేయాలి
తెలంగాణలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ, టీఎస్ఆర్టీసీ అధికారులతో బీఆర్కే భవన్లో సీఎస్ సమావేశమయ్యారు. ఒడిషాలోని అంగూరు, కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా వేగవంతంగా జరిగేలా నిపుణులతో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో చర్చించి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్కు గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించేలా చూడాలన్నారు. తద్వారా రవాణాకు పట్టే సమయం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గుతుందని సీఎస్ తెలిపారు.
మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు మెకానిక్స్, ఇతర నిపుణులను కూడా పంపాలని సూచించారు. కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా సులువుగా తరలించేలా ట్యాంకర్లకు అవసరమైన మార్పులు చేయాలన్నారు. ట్యాంకర్ల రవాణా ప్రక్రియ నిరంతరం సాఫీగా సాగేలా డ్రైవర్లు, మెకానిక్స్తో బృందాలను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 30 ట్యాంకర్లకు అదనంగా ప్రైవేటు గుత్తేదార్ల నుంచి అదనపు ట్యాంకర్లను సమకూర్చుకోవాలని సీఎస్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!