Updated : 18 Jun 2021 14:45 IST

AP News: ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు

అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను ఏపీ ప్రభుత్వం సడలించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సడలింపులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండగా.. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సడలించిన వేళలు ఈనెల 21 నుంచి 30 వరకు అమల్లో ఉండనున్నాయి. తూర్పుగోదావరిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని