ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated : 05 Jul 2021 13:40 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది. సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసేయాలని ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉండనున్నాయి. గోదావరి జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసేయనున్నారు.

ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు అక్కడ ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. 50 శాతం పరిమితితో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా చర్యలు తీసుకుంటూ సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు