Ts News: పండక్కి ఊరెళ్తున్నారా.. ఇవి పాటించండి: సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయంతోనే చోరీలను నియంత్రించవచ్చని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు...

Updated : 08 Jan 2022 15:13 IST

హైదరాబాద్‌: ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయంతోనే చోరీలను నియంత్రించవచ్చని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి సీపీ పలు సూచనలు చేశారు. ‘‘ఇంటి పరిసరాల్లో కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. బైక్‌లు, కార్లను ఇళ్ల ఆవరణలోనే పార్కింగ్‌ చేసుకోవాలని. విలువైన వస్తువులను బైక్‌లు, కార్లలో పెట్టొద్దు. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. పేపరు, పాలవాడిని రావొద్దని చెప్పండి. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలని, ఇంటి డోర్‌కు సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరే పెట్టుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌, బీట్‌ కానిస్టేబుల్‌ నంబర్లను ఉంచుకోవాలి. నమ్మకమైన వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి. బంగారు నగలు, నగదు.. బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలి’’ అని ప్రజలకు సీపీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని