బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వం విధించిన నిబంధనలపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ శాఖ అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట, ప్రజా రవాణా సమయంలో మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి అని ఆ పేర్కొంది....

Updated : 09 Nov 2022 11:44 IST

సైబరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతండటంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వం విధించిన నిబంధనలపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ శాఖ అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట, ప్రజా రవాణా సమయంలో మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి అని ఆ పేర్కొంది. అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ కార్టూన్‌ను విడుదల చేసింది. ఆ కార్టూన్‌లో.. మాస్క్‌ ధరించని ఓ వ్యక్తి కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ఓ పోలీసును ప్రశ్నిస్తాడు. దానికి ఆ పోలీసు సమాధానమిస్తూ కొందరు వ్యక్తులు పోలీసులు తారసపడినప్పుడు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు అని సదరు వ్యక్తిని ఉద్దేశించి అంటారు. ట్రాఫిక్‌ పోలీసుశాఖ పంచుకున్న ఈ కార్టూన్‌ ఆలోచన రేకెత్తిస్తోంది. మాస్క్‌ ధరించకుండా కనిపించినవారిపై పోలీసు శాఖ జరిమానాలు విధింస్తున్న విషయం తెలిసిందే.. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని