Cyclone Asani: అనూహ్యంగా దిశ మార్చిన అసని.. కొనసాగుతున్న రెడ్‌ అలర్ట్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీ., నర్సాపురానికి 30కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.

Updated : 11 May 2022 15:49 IST

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీ., నర్సాపురానికి 30కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. అనూహ్యంగా దిశ మార్చుకుంటున్న తుపాను అసని.. నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో భూభాగంపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 6కి.మీ.వేగంతో కదులుతున్నట్టు తెలిపింది. భూభాగంపైకి వచ్చిన అనంతరం సాయంత్రంలోగా యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశం ఉంది.

అనంతరం క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని తెలిపింది. కోస్తాంధ్ర తీరానికి అతి దగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. తుపాను పరిసర ప్రాంతాల్లో గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు