Andhra News: కొనసాగుతున్న వాయుగుండం.. రేపట్నుంచి ఏపీలో భారీ వర్షాలు!
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి తపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది.
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి తపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం కారైకాల్కు 610 కి.మీ, చెన్నైకి 700 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రేపట్నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కామన్ అలర్ట్ ప్రొటోకాల్ ద్వారా సబ్స్క్రైబర్లకు హెచ్చరిక సందేశాలు జారీ చేయనున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇవ్వనుంది. ఇక సహాయ చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసింది. శనివారం వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు. ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Michael Review: రివ్యూ : మైఖేల్
-
Movies News
K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!
-
General News
Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు