Tauktae: నడి సంద్రంలో ఆపద్బాంధవులు

ఇటీవలి తౌక్టే తుపాను సమయంలో గుజరాత్‌లోని అమ్రేలీ వద్ద సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు తీర ప్రాంత రక్షణ దళం పెద్ద సాహసమే చేసింది....

Published : 26 May 2021 01:14 IST

22 మంది మత్స్యకారులను కాపాడిన రక్షణ దళం

అమ్రేలీ: ఇటీవలి తౌక్టే తుపాను సమయంలో గుజరాత్‌లోని అమ్రేలీ వద్ద సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు తీర ప్రాంత రక్షణ దళం పెద్ద సాహసమే చేసింది. గంటకు 145 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచే భీకర గాలుల మధ్య నడి సముద్రంలో అత్యంత సాహసంతో 22 మందిని కాపాడింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని తీర ప్రాంత రక్షక దళం నౌకలోని వారిని రక్షించింది.

దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు గోవా తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపించింది. తుపాను ధాటికి ఈ నెల 17న అరేబియా సముద్రంలో 261 మందితో ప్రయాణిస్తున్న బార్జ్ పి-305 నౌక నీట మునిగిపోయింది. అధికారులు దాదాపు 180కి పైగా మందిని కాపాడారు. 70 మంది మృతదేహాలు లభించాయి. మరికొందరి ఆచూకీ లభించలేదు. నౌక మునిగిపోవడానికి కెప్టెన్‌ రాకేశ్‌ పల్లవ్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం నుంచి బయటపడ్డ నౌక చీఫ్ ఇంజినీర్‌ రెహమాన్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. కాగా రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు