గుజరాత్‌ తీరాన్ని తాకిన తౌక్టే

పశ్చిమ తీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న  ‘తౌక్టే’ తుపాన్‌ గుజరాత్‌ తీరాన్ని తాకింది. మరికొన్ని గంటల్లో పోరుబందర్‌-మహువాల మధ్య తీరాన్ని దాటనుంది.  దీంతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లో

Updated : 17 May 2021 22:45 IST

అహ్మదాబాద్‌: పశ్చిమ తీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ‘తౌక్టే’ తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకింది. మరికొన్ని గంటల్లో పోరుబందర్‌-మహువాల మధ్య తీరాన్ని దాటనుంది. దీంతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లోని నాలుగు జిల్లాల్లో తుపాన్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దాదాపు మరో 2 గంటల పాటు తీరంలో తుపాన్‌ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. తుపాన్‌ కారణంగా 185 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వెరవల్‌-సోమనాథ్‌ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌ ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లోని లక్షన్నర మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిచింది. సహాయ చర్యల్లో 44 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయి. మరోవైపు మహారాష్ట్రలో తౌక్టే తుపాన్‌ బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని