నేను కూడా టీకా వేసుకున్నా!

ప్రాణానికి రక్షణ కల్పించే టీకాను దూరంచేసుకోకుండా స్ఫూర్తినిచ్చే వీడియో..

Updated : 07 Dec 2022 13:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల అరవై లక్షలకు పైగా ప్రజలకు కరోనా సోకింది. వారిలో పద్దెనిమిది లక్షల మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే.. మరికొందరు  ఇంజక్షన్‌ (సూదిమందు) అంటే ఉన్న భయంతో టీకా వేయించుకోమనే వారూ ఉన్నారు. ఇలాంటి విచిత్రమైన కారణంతో ప్రాణానికి రక్షణ కల్పించే టీకాను దూరంచేసుకోకుండా.. వారికి స్ఫూర్తినిచ్చే వీడియో ఒకటి ఇటీవల వైరల్‌ అవుతోంది. ఇది  సరదా సరదాగా నవ్విస్తూనే, సూదిమందు తీసుకోవటం ఎంత సులభమో చెపుతోంది. ఇంతకీ ఇందులో ఏముందంటే..

ఓ తండ్రి, కుమార్తె టీకా వేయించుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వస్తారు. ఐతే ఇంజక్షన్‌ తీసుకునేందుకు ఆ చిన్నారి భయపడుతుంది. పాప ఆందోళనను తగ్గించేందుకు అక్కడి నర్సు, ఆ వ్యక్తి ఓ ఆలోచన చేస్తారు. దీని ప్రకారం నర్సు అతని చేతిపై టీకా వేసినట్టు చేస్తారు. తాను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు.. ఆ సమయంలో కాస్త నొప్పి వచ్చినట్టు ఆ వ్యక్తి నటిస్తారు. అనంతరం నాకేం కాలేదని నవ్వుతూ చెప్తారు. దీనితో ఆ చిన్నారి కూడా ధైర్యంగా టీకా వేయించుకుంటుంది. నవ్వుతూ టాటా చెపుతుంది. కాగా, ప్రస్తుత సమాజంలో మనకు ఇలాంటి తల్లితండ్రులే కావాలంటూ  పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి..

వస్తువులు తీసుకుని డబ్బు ఇస్తుంది..

101 ఏళ్ల మహిళకు తొలి టీకా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు