Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/10/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 03 Oct 2023 00:12 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గాస్తోత్రం చదవాలి.

మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. దుర్గాశ్లోకాలు చదవాలి.

సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.

శుభకాలం. బుద్ధిబలంతో లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. శ్రీదత్తాత్రేయస్వామి వారి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

ప్రారంభించే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్యహృదయం చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలంగా  ఉంది. మితంగా ఖర్చు చేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

 

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త  వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని