Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (01/12/22)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 01 Dec 2022 00:16 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోబలంతో చేసే పనులు సఫలం అవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారం కలిగిస్తాయి. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో  వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీరామనామాన్ని జపించడం శుభప్రదం.

శుభ కాలం. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అనుకూలమైన సమయం. ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. 

బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోరాదు. గణపతి ఆరాధన శుభప్రదం.  

ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు.

కష్టపడితే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి,మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.

 

శరీరసౌఖ్యం కలదు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. శ్రీరామనామాన్ని స్మరించండి.

మీలోని నిబద్ధతే మిమ్మల్ని రక్షిస్తుంది. స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు