Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు ఉంటాయి.
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.ఆర్ధిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. రామరక్షా స్తోత్రం చదవడం వల్ల ఆపదలు తొలగుతాయి.
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి.సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మానవద్దు.
అనుకున్న పనులు నెరవేరుతాయి.మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో బద్ధకాన్ని దరిచేరనీయకండి. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
మనోభీష్టం నెరవేరుతుంది.మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృతగుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి.శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు.చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసులో ప్రముఖ సంస్థలకు నోటీసులు
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వర్కౌట్ గ్లో’.. ఊటీలో నోరా సందడి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు