Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే?
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.
మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధు,మిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివాష్టకాన్ని చదివితే మంచిది.
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.
ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ద్వాదశ చంద్రదోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరదర్శనం మంచిది.
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్ధికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
యశోవృద్ధి కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.
బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.