Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/08/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (02/08/22)

Updated : 02 Aug 2022 04:05 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు స్వల్ప అనారోగ్య సమస్యల బారిన పడతారు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహాన్ని విడనాడాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో  కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన శుభప్రదం.

దైవానుగ్రహంతో  చేపట్టిన పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

భవిష్యత్తు  ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.
 

సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

విజయసిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.

ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో  మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం.

ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శివ నామస్మరణ మంచిది.

 

మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభకరం.

మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. నవగ్రహధ్యానం శుభప్రదం.

చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. దైవబలం ఉంది. కుటుంబసభ్యులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని