ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/01/2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/01/22)

Updated : 03 Jan 2022 04:57 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

 మొదలుపెట్టిన పనుల్లో చిత్తశుద్ధి అవసరం. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

 చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతమవుతుంది. అనవసరంగా ఆందోళన తగ్గించుకుంటే మంచిది. శివపంచాక్షరీ స్తోత్రము పఠిస్తే మంచిది.

ముందస్తు ప్రణాళికలతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో అనూహ్య లాభాన్ని పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది. 

మిత్రుల సహకారం ఉంటుంది. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

అనుకూలమైన సమయం. మిత్రులు, బంధువులు మీ మాటకు విలువిస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

 చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఒత్తిడి పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. కనకధారాస్తవం పఠించాలి.

శుభకాలం. ఏ పని తలపెట్టిన త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

 ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. రామ నామాన్ని స్మరించండి.

చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంది. దైవబలం రక్షిస్తోంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

 

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులుపడతారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి పఠిస్తే మంచిది.

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. దైవారాధన మానవద్దు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని