Published : 03 Jul 2022 05:14 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికి రాదు. ఓర్పు చాలా అవసరం. బంధు,మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చేపట్టే పనిలో విఘ్నం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి.  చంద్రధ్యానం శుభప్రదం.

మొదలుపెట్టే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దుర్గారాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరు. ఆర్ధికంగా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. దైవారాధన మానవద్దు.

ఊహించిన ఫలితాలు వస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మసిద్ధి ఉంది. ఈశ్వర నామాన్ని జపించాలి.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడతారు. మీ ప్రతిష్టకు మచ్చతెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. శివ మహిమ స్తోత్రం చదివితే బాగుంటుంది.

కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ధర్మసిద్ధి కలదు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

అనుకూలమైన సమయం. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు, వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

 

తోటివారి సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిశ్రమ కాలం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చెడు సావాసాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక చికాకులు పెరగకుండా జాగ్రత్తపడాలి. దత్తాత్రేయ ఆరాధన శ్రేయస్సును ఇస్తుంది.

మీదైన రంగంలో ప్రగతి సాధిస్తారు. బంధు,మిత్రులను కలుపుకొని పోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. సూర్యారాధన మంచిది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని