Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04/09/2022)
ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (04/09/22)
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
తలపెట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీఆరాధన, కనకధారాస్తవం చదవాలి.
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
మీలోని శ్రద్ధాసక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా నామస్మరణ శుభాన్నిస్తుంది.
ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకులాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో అణిగిమణిగి ప్రవర్తించవలసి ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
ముఖ్య వ్యవహారాల్లో అనుకున్నది దక్కుతుంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గా స్తోత్రం పఠిస్తే మంచిది.
శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్