Published : 06 Jun 2022 03:34 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-06-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

చేసే పనిలో అలసట పెరుగుతుంది. తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ ధ్యానం చేయండి.

గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

శుభ ఫలితాలున్నాయి. ఒక ముఖ్యమైన పనిని  విజయవంతంగా  పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.

చేపట్టే పనుల్లో శ్రద్ధ బాగా అవసరం. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాటంతో  ఖర్చులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.

మధ్యమ ఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. ముఖ్యుల దగ్గర అనవసర అంశాలను ప్రస్తావించకండి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఇబ్బంది కలిగించేవారి నుంచి  జాగ్రత్తగా తప్పుకోవాలి. ఒక శుభవార్త మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ సందర్శనం శుభప్రదం.

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రము చదివితే మంచిది.

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం.  నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts