Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/22)

Published : 07 Aug 2022 04:05 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మీ మీ రంగాల్లో  శుభఫలితాలను అందుకుంటారు. ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆనందప్రదమైన  కాలాన్ని గడుపుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో  పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇష్టదైవ ఆలయ  సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.

ప్రయత్నకార్యానుకూలత ఉంది. అభివృద్ధికి  సంబంధించిన  శుభవార్త  వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

శుభాలు చేకూరుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.  

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

చిత్తసౌఖ్యం ఉంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం  చదవాలి.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

 

చేపట్టే పనిలో ద్వంద్వ వైఖరి వీడాలి. ఎన్ని ఆటంకాలు  ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

దూరదృష్టితో ముందస్తు  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో శుభఫలితాలను అందుకుంటారు. అంతటా మంచే జరుగుతుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.  

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని