Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/10/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (07/10/22)

Published : 07 Oct 2022 02:58 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.  

ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం.

 

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
 
 

ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను, విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్యహృదయం చదవడం మంచిది.

శుభకాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో  వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts