Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-02-2023)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-02-2023)

Published : 09 Feb 2023 00:31 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. ఆత్మీయు సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.  

మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆశించిన ఫలితాల కన్నా మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. దైవబలం అనుకూలిస్తోంది. విశేషమైన ఆర్థికఫలితాలు ఉన్నాయి. ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలుంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. 

చేపట్టే పనులను పట్టుదలతో పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి.. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు. ప్రయాణాల్లో జాగ్రత్త కాస్త జాగ్రత్త వహించండి. చంద్ర ధ్యానం శుభప్రదం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలను నిలకడగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. లింగాష్టకం చదవండి మంచి జరుగుతుంది.

 

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని