Updated : 09 Jun 2022 04:29 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-06-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

అనుకూల పరిస్థితులున్నాయి. కీలక ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వస్తువులను కొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

శ్రమతో కూడిన విజయాలున్నాయి. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. దుర్గ దేవి  స్తోత్ర  పారాయణ చేయడం మంచిది.

చేపట్టే పనిలో అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది.

శుభకాలం. దైవబలం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. గణపతి నామాన్ని స్మరించడం వల్ల మంచి జరుగుతుంది.

 ముఖ్యవిషయాల్లో ఆచితూచి అడుగు వేయండి మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు వద్దు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ నామాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీరు ఊహించినదానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువులమీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.  మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. శ్రీ విష్ణు  సహస్రనామావళి పఠించడం మంచిది.

ముఖ్య వ్యవహారాలలో అనూహ్యమైన లాబాలు పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. సాయి బాబా సందర్శనం శుభప్రదం.

శుభకాలం. కీలక  నిర్ణయాలు గొప్ప లాభాన్నిస్తాయి. తలపెట్టిన కార్యాల్లో విజయం ఉంది . లాభదాయకమైన ఫలాలున్నాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. సూర్య స్తుతి శక్తినిస్తుంది.

 

అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. గోవింద నామాలు చదవటం మంచిది.

చేపట్టే పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రమ పెరుగుతుంది. మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఈశ్వర ధ్యాన శ్లోకం చదవండి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని