Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-07-2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (09/07/22)

Updated : 09 Jul 2022 04:17 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

భవిష్యత్  ప్రణాళికలో  స్పష్టత వస్తుంది.  తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

మంచిపనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

శ్రమతో  కూడిన  ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో  కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది.  కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా సందర్శనం, శని ధ్యానం శుభప్రదం.

లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణ శుభప్రదం.

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

 చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా  గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి.  కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
 
 

శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు  మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
 

తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త  ఆనందాన్ని ఇస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య, చంద్ర ఆరాధన శుభప్రదం.  

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.  ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని