Published : 09/12/2021 04:03 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09-12-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదిత్య హృదయం పఠించాలి.

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధైర్యం, శరీరబలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీవిష్ణు ఆరాధన చేయడం మంచిది.

శుభ కాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది. 

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి.  

మీమీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనధాన్యవృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది. 

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందా నామాలు పఠిస్తే బాగుంటుంది.  

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం.

కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే  బాగుంటుంది.

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.

 

ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శని ధ్యాన శ్లోకం చదివితే శుభప్రదం.

శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను, విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయండి.   ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సివస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని