Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/12/22)
Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు.
శుభకాలం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలకనిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది.
శుభకాలం. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
శ్రమ అధికం అవుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశానికి పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. గోవిందనామాలు చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన మంచిది.
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనఃసంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ మంచిది.
పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్గా మారిన సూర్య వ్యాఖ్యలు
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు