Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10-12-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 10 Dec 2021 04:18 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ శుభాన్ని కలిగిస్తుంది.

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన వల్ల బాగుంటుంది.

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన వల్ల మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

 

శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని