Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/10/2022)
ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (11/10/22)
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు. శని శ్లోకాన్ని చదవడం అన్నివిధాలా మంచిది
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను వదలకండి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం.
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
చేపట్టే పనిలో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో అవగాహనాలోపం రాకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కనకధారాస్తవం చదవాలి.
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మంచి మనస్సుతో పనులను ప్రారంభిస్తారు. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
India News
Boycott Culture: ‘బాయ్‌కాట్’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే